బహిరంగ సభలో కన్నీళ్ళతో కవిత ప్రసంగం

September 01, 2026


img

నేడు నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌ పార్టీ అధ్వర్యంలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించారు. ఆ సభలో ప్రసంగిస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత తనను పార్టీ నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నారు.

అలా కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఆమె భావోద్వేగంతో ప్రసంగిస్తుంటే సభకు హాజరైన మహిళలు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. 

“నేను ఏం తప్పు చేశానని నన్ను పార్టీలో నుంచి బయటకు గెంటేశారని అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మన ఇంట్లో ఓ ఆడబిడ్డకు కష్టం వస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాము. కానీ నన్ను అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించి ఆర్నెల్లు జైల్లో పెట్టారు. అలాంటి పరిస్థితిలో ఏ తండ్రి అయినా ఏం చేస్తారు? కానీ నన్ను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు గెంటేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సొంత గడ్డపై ఓ ఆడబిడ్డ ఇలా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తుందనుకోలేదు. నన్ను ఒంటరి దానిని చేసినా నేను భయపడలేదు. ఎందుకంటే నేను పిరికి దానిని కాదు కనుక. ఒంటరిగానే పోరాడుతున్నాను. నన్ను పిరికిదానిని అనుకోవద్దు,” అంటూ ఆమె కన్నీరు తుడుచుకుంటుంటే వేదికపై ఉన్నవారు ‘సిఎం సిఎం..’ అంటూ నినాదాలు చేశారు. వారిని వారిస్తూ ఆమె తన ప్రసంగం కొనసాగించారు.

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="te" dir="ltr">బీఆర్ఎస్ మీద కక్షతో నన్ను జైలుకు పంపారని ఆ పార్టీ పెద్దలే చెప్పారు.. ఇప్పుడు ఆ పార్టీ నుంచే నన్ను బయటకు పంపారు.. ఏ తప్పూ చేయని నన్ను జైలుకు పంపినవారికి రాజకీయంగా సమాధానం చెప్తా. <a href="https://t.co/g0JwcU38mx">pic.twitter.com/g0JwcU38mx</a></p>&mdash; Kavitha Kalvakuntla (@RaoKavitha) <a href="https://x.com/RaoKavitha/status/2094406888201068584?ref_src=twsrc%5Etfw">August 31, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>         



Related Post