తెలుగు సినీ పరిశ్రమలో భిన్నమైన కథలు, పాత్రలు చేస్తూ అందరినీ మెప్పిస్తున్న నటులలో శ్రీవిష్ణు కూడా ఒకరు. తాజాగా సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై 39వ చిత్రంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు ప్రకటిస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ చాలా ఆసక్తికరంహా ఉంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకొంటున్నప్పుడు విద్యార్ధులు కనే కలలకు పెద్దాయ్యాక సాగే జీవితం భిన్నంగా సాగుతుంటుంది. ఇది అందరి కథ. కానీ ప్రతీ ఒక్కరూ మనం జీవితంలో ఏం కోరుకున్నం? ఏం కోల్పోయాము? అని వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా కనబడతాయంటూ ఫస్ట్ గ్లిమ్స్‌లో చెప్పిన మాటలు ఈ ప్రపంచంలో చాలా మందికి వర్తిస్తాయి. కనుక ఇది అందరి కథ. వీడియో
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: సన్నీ సంజయ్, రచన: దీప్తి శ్రీ జుట్టాడ, సంగీతం: చందు, రవి, సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల, ఎడిటింగ్: వెంకటేష్ చుండూరు చేస్తున్నారు.
ఎస్.నాగ వంశీ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో నటీనటుల పేర్లు త్వరలో ప్రకటిస్తారు.