గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ ‘ఎన్‌బీకె 111’ వర్కింగ్ టైటిల్‌తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మంచు మనోజ్, సముద్రఖని, ఆర్.శరత్ కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక ముఖ్య పాత్రలు చేస్తున్నారు. స్పెషల్ సాంగ్‌లో నర్గీస్ ఫఖిరీ సందడి చేయబోతున్నారు.
ఈ సినిమాకు మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, వి.వెంకట్, రవివర్మ, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే ఫర్ చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ బాలయ్య మార్క్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.