తెలంగాణలో దంచికొడుతున్న వానలు

August 30, 2026
img

గత వారం రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నేడు ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మరో రెండు మూడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నేడు వారాంతపు సెలవు కనుక ఎంత వాన పడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రేపు కూడా వర్షం కొనసాగితే స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధులు, ఐటి కంపెనీల ఉద్యోగులు, వ్యాపారస్తులు, ముఖ్యంగా తోపుడు బళ్ళపై వ్యాపారాలు చేసుకునేవారు చాలా ఇబ్బంది పడతారు. కానీ తప్పదు కనుక ముందస్తు ఏర్పాట్లు చేసుకొని రోడ్డు మీదకి రావడం మంచిది. 

Related Post