ఆదర్శ కుటుంబంలో గొడవలా?

August 30, 2026


img

త్రివిక్రమ్ శ్రీనివాస్-వెంకటేష్‌ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ ప్రకటించినప్పుడే చాలా భారీ అంచనాలు ఏర్పడాయి. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు ఈ ఆదర్శ కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నయట. 

ఈ సినిమాని సినిమాటోగ్రాఫర్‌గా సాను జాన్‌తో మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు అయన స్థానంలో రవి కె. చంద్రన్‌ను తీసుకున్నట్లు సమాచారం. అలాగే సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తమన్‌ను తీసుకున్నారు. తాజాగా ఎడిటింగ్ విభాగంలోనూ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ స్థానంలో నవీన్ నూలిని తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పులకు ముందు పూర్తిచేసిన సన్నివేశాలపై కొంత చర్చ జరిగే ఉంటుంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున ఏమాత్రం తగ్గినా బోర్లా పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ మార్పులు చేసుకొని మళ్ళీ షూటింగ్‌ మొదలుపెట్టినందున పూర్తవడానికి కాస్త సమయం పట్టవచ్చు. కనుక వెంకటేష్‌-త్రివిక్రమ్ షూటింగ్‌ వేగం పెంచితే తప్ప అక్టోబర్‌ 2న రిలీజ్‌ చేయలేరు. మరి సకాలంలో పూర్తి చేయగలరో లేదో త్వరలో తెలుస్తుంది.     

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్,  బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్,  ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు దర్శకత్వం & స్క్రీన్‌ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష