ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ మజ్లీస్ నుంచి బహిష్కరణ!

August 29, 2026


img

మజ్లీస్ పార్టీలో అనూహ్య పరిణామం జరిగింది. ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్‌ని తక్షణం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ ప్రకటించారు. ఆయనను తన పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించింది.  

మిర్జా రహమత్ బేగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఈ వివాదానికి కారణం. అయన అత్తాపూర్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం చేయబోతే స్థానిక యువకులు పట్టుకొని చితకబాది, ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తన ఫోటోని మార్ఫింగ్ చేసి లేదా డీప్‌ఫేక్‌ ద్వారా ఆ వీడియో తయారు చేశారని మిర్జా రహమత్ బేగ్‌ వాదిస్తున్నారు. పార్టీలోనే కొందరు తన ప్రతిష్టను దెబ్బతీసి బయటకు సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారే ఈ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మిర్జా రహమత్ బేగ్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. 

గత కొంత కాలంగా తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వారు అడిగినంతా  డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారని ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతుండగానే, పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. ఈ మేరకు 

2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన మిర్జా రహమత్ బేగ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చాలా సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ఇంత కటిన చర్య తీసుకోవడంతో పార్టీ కూడా ఆయన ఈ అకృత్యానికి పాల్పడ్డారని భావిస్తోందని స్పష్టమవుతోంది. పార్టీలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనపై అధిష్టానానికి పిర్యాదులు చేయడం కూడా మరో కారణమని తెలుస్తోంది. 


Related Post