రాఖీ పండుగకు భోగి పెర్ఫెక్ట్ పోస్టర్

August 28, 2026


img

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భోగి’ సినిమా నుంచి నేడు రాఖీ పండుగ సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. 

శర్వానంద్ లుంగీ, బనియన్ ధరించి, తాటి ముంజలు ఒలుస్తుంటే, ఆయన చుట్టూ ఐదుగురు అక్క చెల్లెళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వాటిని తింటున్నట్లు పోస్టర్‌లో చూపారు. ఇది రాఖీ పండుగకు సరిపడే పోస్టరే. 

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కందుల సులోచనా రాణి అఅనే గిరిజన మహిళగా నటిస్తోంది. 1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాల నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన వాయిదా పడింది. కొత్త రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.   



Related Post

సినిమా స‌మీక్ష