టీవీ న్యూస్ రీడర్ అవ్వాలనుకుంటున్నారా? ఇదిగో అవకాశం!

August 28, 2026
img

ఇప్పుడు చాలా మంది మొబైల్ ఫోన్లతో రీల్స్ చేస్తూనే మంచి గుర్తింపు, డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. అలాగే యూట్యూబ్‌ ఛానల్స్ పెట్టుకొని రకరకాల అంశాలతో ఆకట్టుకునేవారు కోకొల్లలు. కానీ టీవీ షోలు, సినిమాలలో అవకాశాల కోసం కాళ్ళరిగి పోయేలా తిరిగేవారికి మాత్రం తగిన అవకాశాలు లభించడం లేదు. అలాంటివారికి ఈటీవీ వంటి ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో పని చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. 

ఈటీవీ న్యూస్ ఛానల్లో వార్తలు చదివే ‘న్యూస్ రీడర్స్’ కావాలంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. చక్కటి రూపం, మంచి స్వరం, తెలుగులో స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి. సినిమాలు, రాజకీయాలు, క్రీడలు తదితర అంశాలపై మంచి అవగాహన కలిగి ఉండాలి. కనీసం డిగ్రీ చేసి ఉండాలి. 35 ఏళ్ళలోపువారు అర్హులు. ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

అర్హత, ఆసక్తి కలిగినవారు ఏదైనా ఒక వార్తని చదివి వీడియో రికార్డ్ చేసి 93944 89300 నంబరుకి వాట్సప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అదే వీడియోలో మీ పేరు,  ఊరు, చిరునామా, ఫోన్ నంబర్ వగైరా వివరాలు కూడా రికార్డ్ చేసి పంపించాలని ఈటీవీ కోరింది. ఇలాంటి ప్రసిద్ద న్యూస్ ఛానల్లో, ఇలాంటి పాపులర్ ఉద్యోగానికి అవకాశం లభిస్తున్నప్పుడు వదులుకోవడం దేనికి? ఓసారి ప్రయత్నిస్తే మంచిది కదా?                   

Related Post