బ్రేకప్‌కు సారీ... పెళ్ళికి సిద్ధం: ఆకృతి అగర్వాల్

October 13, 2026


img

క్రికెటర్‌ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్‌ మార్చి నెలలో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఆర్నెల్లు తర్వాత అంటే సెప్టెంబర్‌లో అది రద్దు చేసుకుంటున్నామని ఆకృతి అగర్వాల్‌ సోషల్ మీడియాలో ప్రకటించారు. మళ్ళీ నెల తిరక్కుండానే ఆ నిర్ణయం వెనక్కు తీసుకుంటున్నానని ఇద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ఆకృతి సోషల్‌ మీడియాలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. .

కొందరి అభిప్రాయాల కారణంగా తాను ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నానని దానిలో పేర్కొన్నారు. పృథ్వీ షాతో మాట్లాడకుండా, తమ బంధం గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండానే విడిపోవాలని నిర్ణయించుకోవడం తప్పేనని ఆమె అంగీకరించారు. తన నిర్ణయం వల్ల పృథ్వీకి బాధ కలిగించినందుకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇటీవల తామిద్దరం మనసు విప్పి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆకృతి తెలిపారు. ప్రేమ, పెళ్ళి విషయంలో ఇతరులతో చర్చించడం కంటే పరస్పరం మాట్లాడుకొని నిర్ణయించుకోవడం చాలా ముఖ్యమని తనకు అర్ధమైందని ఆకృతి అగర్వాల్ తెలిపారు.  పృధ్వీ షా కూడా ఆమెలో ఈ మార్పుని అంగీకరిస్తున్న సూచనగా ఆమె పోస్టును అభిమానులతో పంచుకున్నారు. కనుక ఈసారి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా వారిరువురూ పెళ్ళి చేసుకోవడం మంచిది.  



Related Post