చిన్న పిల్లల కోసం సల్మాన్ యూట్యూబ్‌ ఛానల్;; శభాష్!

October 11, 2026


img

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ అనే పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్‌లోని కంటెంట్‌ పెద్దల కోసం కాదని, పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు సల్మాన్ తెలిపారు. 

సల్మాన్ ఖాన్ ‘‘నా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్‌ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. కానీ దీనిలో కంటెంట్ మీ కోసం కాదు. పిల్లలకు ప్రేమ, కుటుంబ విలువలు, విద్య ఏవిధంగా అవసరమో వినోదం కూడా అంతే అవసరం,” అని తెలిపారు.  

ఈ ఛానల్‌లో సల్మాన్ తనదైన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటి అంశాలను సరదాగా పరిచయం చేస్తున్నారు. ఒకే వ్యక్తి కోచ్‌గా, విద్యార్థిగా రెండు పాత్రల్లో కనిపిస్తూ నటనకు సంబంధించిన విషయాలను వివరిస్తున్నారు. 

వినోదంతో పాటు పిల్లలకు ఉపయోగపడే విషయాలను నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఛానల్ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ప్రస్తుతం ‘మాతృభూమి’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క ‘బిగ్‌బాస్‌ 20’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష