సీనియర్ సీపీఎం నాయకుడు ఎం.ఏ. గఫూర్ కుమారుడు పీవీ కిరణ్ కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో గుండెపోటుతో మృతి చెందారు. అయితే అతను పది రోజుల క్రితం తన గదిలో గుండెపోటుతో చనిపోయిన విషయం ఎవరికీ తెలియలేదు. దీంతో ఈ విషయం చాలా ఆలస్యంగా బయటపడింది. చేతికి అందివచ్చాడనుకున్న కొడుకు దేశం కాని దేశంలో ఈవిధంగా మృతి చెందినట్లు తెలుసుకొని గఫూర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కిరణ్ ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్, న్యూయార్క్ యూనివర్సిటీలో డేటా సైన్స్ పూర్తి చేశారు. పేపాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్టుగా పనిచేస్తున్నారు.
కిరణ్ ఒంటరిగా నివసిస్తుండటంతో చనిపోయిన తర్వాత ఈ విషయం బయటపడలేదు. అతని ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగులు పిర్యాదు చేయడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూస్తే కిరణ్ విగతజీవిగా పడున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కిరణ్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి గుండెపోటుతో చనిపోయినట్లు ధ్రువీకరించుకున్నారు.
అతని మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత అతని వివరాలు సేకరించి తల్లితండ్రులకు ఈ సమాచారం అందించారు.