తెలంగాణలో కొత్తగా మరో 4.63 లక్షల మందికి పెన్షన్లు.. రేపే!

November 25, 2026


img

తెలంగాణలో కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవంబర్ 26న వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేయనుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిధులు విడుదల చేయబోతున్నారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి చేయూత పెన్షన్లు అందుకోబోతున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితరులు ఈ పెన్షన్లు అందుకోబోతున్నారు. ఈ మేరకు  కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అధికారులు ఇప్పటికే పంపిణీ చేశారు.

ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారితో పాటు కొత్తగా పెన్షన్లు మంజూరైన 4.63 లక్షల మందికి కూడా ఒక్కొక్కరికీ ప్రభుత్వం నెలకు రూ.4,000 పెన్షన్ అందించబోతోంది. 

నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కొత్త పెన్షన్ల డబ్బులు లబ్దిదారుల ఖాతాలలో జమా చేయాలని ప్రభుత్వం భావించింది కానీ అనివార్య కారణాలతో ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేసింది.

రేపే రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది.


Related Post