విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న‘వృషకర్మ’ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నెల్లూరులోని నార్త్ రాజుపాలెం వద్ద గల శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ట్రైలర్ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నట్లు సుకుమార్ రైటింగ్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ట్రైలర్ నిడివి 2.50 నిమిషాలని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది.