భోగి నుంచి థీమ్‌ సాంగ్‌...గంగ

November 25, 2026


img

శర్వానంద్, అనుపమ పరమేశ్వన్ జంటగా చేస్తున్న ‘భోగి’ సినిమా నుంచి లిరికల్ వీడియో థీం సాంగ్‌ విడుదలైంది. గంగా అంటూ సాగే చంద్రబోస్ వ్రాసిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగానల్గొండ గద్దర్ నరసన్న గంభీరమైన స్వరంతో ఆవేశంగా పాడారు.    

సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో దొరల అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల నేపధ్యంతో తెరకెకించారు. ఈ సినిమాలో డింపుల్ హయతీ, శ్రస్థ శ్రీవాత్సవ్, అవినాష్ ముఖ్యపాత్రలు చేశారు.   

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 27న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష