ప్రయాణికులతో రైళ్ళు, బస్సులు కిటకిట

October 10, 2026
img

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు దసరా పండుగ సెలవులు ఇచ్చేశారు. కనుక హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో తమ సొంత ఊర్లకు, అలాగే ఆంధ్రా, తమిళనాడు, బెంగళూరులోని తమ బంధుమిత్రులను గడిపేందుకు ప్రజలు బయలుదేరుతున్నారు. 

దసరాకు ప్రత్యేక బస్సులు, రైళ్ళు ఎన్ని వేసినప్పటికీ అన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ పండుగ సీజనులో రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 7,000 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అయినా సరిపోవడం లేదు. బస్టాండ్లు, ఉప్పల్, ఎల్బీ నగర్‌, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, ప్యారడైజ్ తదితర బోర్డింగ్ పాయింట్స్ వద్ద బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు.

ఇక హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలతో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద ఎంత వేగంగా వాహనాలను క్లియర్ చేస్తున్నప్పటికీ మళ్ళీ క్షణాలలో భారీగా వాహనాలు పేరుకుపోతూనే ఉన్నాయి. 

దసరా పండుగకు ప్రత్యేక రైళ్లలో టికెట్లు ‘ఐఆర్‌సీటీసి’ లేదా ‘రైల్ వన్’ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్స్ చేసుకోవచ్చు.

ప్రత్యేక రైళ్ల వివరాలు: 

ట్రైన్ నంబర్: 07817 / 07818: సికింద్రాబాద్ ↔ కాకినాడ టౌన్. 

ట్రైన్ నంబర్‌: 07817 రాత్రి 7:25 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. ట్రైన్ నంబర్‌: 07818 రాత్రి 9:00 గంటలకు కాకినాడ నుండి బయలుదేరుతుంది. అక్టోబర్ 9, 10 తేదీలలో. 

ట్రైన్ నంబర్: 07039: సికింద్రాబాద్ → కాకినాడ టౌన్, (ప్రతి బుధవారం) అక్టోబర్ 7 నుండి నవంబర్ 26 వరకు.

ట్రైన్ నంబర్: 07621: హజూర్ సాహిబ్ నాందేడ్ ↔ హజ్రత్ నిజాముద్దీన్., (ప్రతి శనివారం) అక్టోబర్ 17 నుండి నవంబర్ 28 వరకు.

ట్రైన్ నంబర్: 06581 / 06582: యశ్వంత్‌పూర్ ↔ సహర్సా

 ట్రైన్ నంబర్: 06581 (ప్రతి ఆదివారం); ట్రైన్ నంబర్: 06582 (ప్రతి బుధవారం) అక్టోబర్ 11 నుండి నవంబర్ 29 వరకు.

ట్రైన్ నంబర్: 06589 / 06590: బెంగళూరు కంటోన్మెంట్ ↔ బీదర్

ట్రైన్ నంబర్:: 06589 (అక్టోబర్ 9 & 16); ట్రైన్ నంబర్: 06590 (అక్టోబర్ 10 & 17) తేదీల్లో నడుస్తాయి.

చర్లపల్లి ↔ నాగర్‌కోయిల్ స్పెషల్: ఇరువైపులా 5 ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 23 వరకు.

చర్లపల్లి ↔ సెంగోట్టై స్పెషల్

చర్లపల్లి- సెంగోట్టై (ప్రతి శుక్రవారం), సెంగోట్టై-చర్లపల్లి (శనివారం) అక్టోబర్ 2 నుండి నవంబర్ 28 వరకు.

ట్రైన్ నంబర్: 07046 / 07047: సికింద్రాబాద్ ↔ నహర్లగూన్

ట్రైన్ నంబర్: 07046 (ప్రతి శుక్రవారం); ట్రైన్ నంబర్: 07047 (ప్రతి సోమవారం) అక్టోబర్ 2 నుండి నవంబర్ 2 వరకు.

ట్రైన్ నంబర్: 07652: ఛప్రా- జాల్నా (వారంతపు ప్రత్యేక రైలు) ఈ పండుగ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటుంది).

ప్రయాణికులకు ముఖ్యమైన సూచనలు

ఈ ప్రత్యేక రైళ్ళలో 20,000కు పైగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి. 

లాంగ్-రూట్ రైళ్ల పొడిగింపు: 

విశాఖపట్నం-బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌మీట్‌, నరసాపూర్-తిరువణ్ణామలై సర్వీసులను నవంబర్ చివరి వరకు పొడిగించారు.

చర్లపల్లి నుంచి శ్రీకాకుళం: అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీలలో. మళ్ళీ నవంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో నడపబోతోంది.  సికింద్రాబాద్‌-కాకినాడ: 

విశాఖపట్నం-బెంగళూరు: వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నవంబర్‌ 25 వరకు పొడిగించింది. 

నర్సాపూర్‌-తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్‌ 30 వరకు పొడిగించింది. 

Related Post