అభిజీత్ దీప్కే నాన్నమ్మ మృతి

October 10, 2026
img

నేడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనితో పాటు సీజేపీ నిర్వాహకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ అభిజీత్ దీప్కే పోలీసుల అదుపులో ఉండగా, అక్కడ బిహార్‌లోని స్వగ్రామంలో అయన నానమ్మ సావిత్రిభాయి శంకర్ దీప్కే (85) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

కనుక అభిజీత్ దీప్కే తన నానమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పోలీసులు అతనిని విడుదల చేస్తారా లేదా? ఒకవేళ చేయకపోతే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. 


Related Post