నేటి నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. కానీ ఢిల్లీకి విమానంలో వచ్చిన అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అతనితో పాటు సీజేపీ నిర్వాహకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన అభిజీత్ దీప్కే ముందుగానే తన ఫోన్లో రికార్డ్ చేసి పెట్టిన ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
“ప్రస్తుతం మేము ముగ్గురం పోలీసుల అదుపులో ఉన్నాం. మేము అరెస్ట్ అయినప్పటికీ మన ఉద్యమం కొనసాగాలి. కనుక సీజేపీ తరపున అజింక్య షిండే ఇచ్చే ఆదేశాలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అయన సూచించిన విధంగా జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షలు చేపట్టాలి,” అని అభిజీత్ దీప్కే విజ్ఞప్తి చేశారు.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">IMPORTANT Until Abhijeet Dipke, Saurav Das and Ashutosh Ranka are in detention, CJP’s Organization In-Charge Ajinkya Shinde will lead this protest at Jantar Mantar. Abhijeet had pre-recorded this video last night in anticipation of a potential arrest. @AjinkyaCJP https://t.co/WSQ69mKfTV</p>— Cockroach Janta Party - CJP (@Cockroachisback) <a href="https://x.com/Cockroachisback/status/2108822113800818870?ref_src=twsrc%5Etfw">October 10, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>