వైద్యం చేయించే స్థోమత లేకపోతే బిడ్డను చంపుకోవాలా?

October 09, 2026
img

హైదరాబాద్‌లో ఓ తల్లి తన ఆరేళ్ళ కూతురికి వైద్యం చేయించలేక హుస్సేన్‌ సాగర్‌లోకి విసిరేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌ వెంటనే నీటిలోకి దూకి ఆ పాపను కాపాడాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ పాప గాంధీ హాస్పిటల్లో ఉంది. 

ఓల్డ్‌ బోయినపల్లిలోని హస్మత్‌పేట్‌కు చెందిన ఓ ముస్లిం మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెను భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. వారిలో చిన్న కూతురుకు ఇటీవల పేగు ఇన్‌ఫెక్షన్‌ సోకింది. పాప చికిత్స కోసం అప్పులు చేసినా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. కానీ చికిత్స, మందుల ఖర్చులు మాత్రం తప్పలేదు.

రెండు పూటలా భోజనానికే ఇబ్బంది పడుతున్న ఆ తల్లి ఇలాంటి కటిన నిర్ణయం తీసుకుంది.

సకాలంలో స్పందించి పాపను కాపాడిన ఆటో డ్రైవర్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీసులు తల్లిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కేసులో ఆమె అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే ఇద్దరు కూతుర్లు అనాధలవుతారు. కనుక ప్రభుత్వం, సమాజం వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

Related Post