కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయపోరు ఇప్పుడు రెండు పార్టీల వ్యక్తుల మద్య పోరుగా మారింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పీసీసీ ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సరికొత్త యుద్ధం ప్రారంభించారు.
ఈరోజు సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. దానిలో ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇక నుంచి కేటీఆర్, మమ్మల్ని గోకకపోయినా.. నేను గోకుతూనే ఉంటా...?
ఇక నుంచి వీక్లీ సీరియల్ లాగా కేటీఆర్ బాగోతాలు బయటపెడతా.... కేటీఆర్ ఇంటితో పాటు, పార్టీ ఆఫీస్ కు గోకుడు మందు ‘ఇచ్ గార్డ్’ పంపిస్తున్నా...
మొన్నటి దాకా వాళ్ల బాగోతాలు బయటపెడితే... వాళ్ల పార్టీ వాళ్ల తోటి మా ముఖ్యమంత్రి గారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించారు.
2019 నుంచి 2022 మధ్య ఓ సినీ నటితో సోషల్ మీడియాలో చేసిన సంభాషణ కేటీఆర్ ఎందుకు డిలీట్ చేశారు. కేటీఆర్ హోటల్ బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ప్రజలకు చెప్పాలి.
2015 లో డెక్కన్ సెరాయ్ షేర్ విలువ కేవలం రూ. 5 కోట్లు, పదేళ్లలో రూ . 175 కోట్లకు ఎలా పెరిగింది? ఈ అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేయాలి. మేము ఫిర్యాదు చేస్తాం.
ఈ హోటల్ నుంచి ఎక్కడెక్కడి పార్సిల్ లు వెళ్తాయో, ఎవరెవరికి వెళతాయో తెలుసు. ఏ విచారణకు ఐనా సిద్ధమని చెప్పే కేటీఆర్...నీ పాస్ పోర్ట్ సీజ్ చేయాలన్నా పోలీసులపై కోర్టును ఎందుకు ఆశ్రయించావు?
కేటీఆర్ చెప్పేవి నీతి మాటలు, చేసేవి అవినీతి పనులు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ను అరికట్టేందుకు... చర్యలు చేపడుతుంటే... కేటీఆర్... డ్రగ్స్ కు బ్రాండ్ గా మారుతున్నారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలు ఐతే... KTR లైవ్ లోకి వచ్చి, ఏం జరిగిందో వాస్తవాలు చెప్పాలి.
బీఆర్ఎస్ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కేటీఆర్ ఎందుకు ఎవరితో కలవడం లేదో...? ఇప్పుడు కేసీఆర్ కూడా కేటీఆర్ తో మాట్లాడటం లేదు. ఇద్దరీ మధ్య పంచాయతీ తేల్చడానికి నవీన్ రావు తండ్రి కొండల్ రావు ప్రయత్నం చేస్తున్నారు.
నేను చెప్పేవన్నీ అబద్ధాలంటే…., ఇప్పటికైనా కేటీఆర్ డ్రస్ టెస్టు కు సిద్ధమని చెప్పాలి,” అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. దీనిపై కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో? చూడాలి.