డిసెంబర్‌ 4న నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణి’

October 09, 2026


img

యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’ డిసెంబర్‌ 4న విడుదల చేయబోతున్నట్లు రిలీజ్‌ పోస్టర్‌ వేసి ప్రకటించారు. ‘దండోరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్‌ దేవసోత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో సాయి కుమార్‌, హర్ష్ రోషన్‌ వర్ధన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.  

ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో నితిన్‌ కృష్ణ అనే గణిత ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణి అనే పేరుతో రొమాంటిక్‌ నవలలు రాసే వ్యక్తి గురించి నాని ప్రశ్నించగా.. ఆమె తన భార్య అని నితిన్‌ చెప్పే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిన్న గ్లింప్స్‌ ద్వారా కథపై ఆసక్తిని పెంచారు.

ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కెమెరా: జోమోన్‌ టీ.జాన్‌, ఎడిటింగ్‌: సృజన అడుసుమిల్లి చేస్తున్నారు. 

నటుడు నాని సమర్పణలో దీప్తి గంటా యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష