ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. అయన తొలి సినిమా గమన్ (1978). హిందీ, మరాఠీ భాషల్లో అయన ఎక్కువగా సినిమాలు చేశారు. సలామ్ బాంబే, పరిందా, క్రాంతి వీర్, అంబటి రాంబాబు తక్ చప్పన్, వెల్ కమ్, నట సామ్రాట్ వంటి పలు సినిమాలలో అయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. అయన చివరిగా నటించిన సినిమా 2024లో విడుదలైన ‘వన్వాస్.’
నానా పటేకర్ చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రతీ సినిమాలో విభిన్నమైన పాత్రతో తనదైన ముద్ర వేసేవారు. అందుకే భాషలకు అతీతంగా అయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇంత ప్రతిభ కలిగిన నానా పటేకర్‌కు అనేక అవార్డులు అందుకోవడం చాలా సహజం. ఆయన మూడు జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 2013లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
నానా పటేకర్ మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.