హైకూ ట్రైలర్‌.. అమ్మాయిల కాలేజీలో ఒకే ఒక అబ్బాయి!

October 07, 2026


img

తమిళ డబ్బింగ్ సినిమాలు మనకేమీ కొత్త కాదు. అటువంటిదే ‘హైకూ.’ యువరాజ్‌ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఏగన్‌, శ్రీదేవి, ఫెమినా జార్జ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ అమ్మాయిల కాలేజీలో పొరపాటున ఒక అబ్బాయి జాయిన్ అయితే.. ఇక కామెడీకి కరువే ఉండదు. ఆ కాలేజీలో అతను పడే చిన్న చిన్న ఇబ్బందులతో సినిమా నడిపించాలంటే కష్టం కనుక అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. మిగిలిన కథ ట్రైలర్‌ చూసి ఊహించుకోవచ్చు లేదా ఈ నెల 23న విడుదల కాబోతున్న సినిమా చూసి తెలుసుకోవచ్చు.  

ఈ సినిమాలో ఏగన్‌, శ్రీదేవి, ఫెమినా జార్జ్‌, అదిర్చి అరుణ్‌, సుబ్రమణియా సేతు, అధియమాన్‌, మైమ్‌ గోపీ, ఇందుమతి మణిగందన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: యువరాజ్‌ చిన్నసామి, అదనపు స్క్రీన్‌ప్లే: హరిహరన్‌ రామం, సంగీతం: సిద్ధు కుమార్‌, కెమెరా: ప్రియేష్‌ గురుసామి, కొరియోగ్రఫీ: అనుషా విశ్వనాథన్‌, ఆర్ట్‌: ప్రేమ్‌ కరుంతమలై, ఎడిటింగ్‌: శక్తి ప్రణేష్‌ పి చేశారు.

విజన్‌ సినిమా హౌస్‌ బ్యానర్‌పై డాక్టర్‌ డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 23న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష