తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ ముందు (నవంబర్ నుంచి) ట్రూ-అప్ ఛార్జీలు విధించి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేయడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలోమాట్లాడుతూ, “రైతులకేమో (కరెంట్) కోతలు, ప్రజలకేమో (కరెంట్ బిల్లులు) వాతలు పెడుతోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దసరా, దీపావళి పండుగల ముందు ప్రభుత్వమేదైనా శుభవార్త చెపుతుందేమో? అని ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రూ-అప్ చార్జీల పేరుతో పెద్ద షాక్ ఇచ్చింది. రూ.5240.23 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుల ద్వారా ప్రజల నుండి వసూలు చేయాలనుకోవడం చాలా దుర్మార్గం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కోతలు.. ప్రజలకు వాతలు!
పండుగల సమయంలో ఏ ప్రభుత్వమైనా శుభవార్తలు చెబుతాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దసరా, దీపావళి పండుగల ముందు ప్రజలకు షాకిచ్చింది.
కరెంటు బిల్లుల రూపంలో ఏకంగా రూ. 5,420 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వెంటనే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish