దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి

October 03, 2026
img

హైదరాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో శుక్రవారం ఉదయం అనూహ్య సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆలయంలోకి వచ్చి హటాత్తుగా గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడి చేశాడు.

ఆలయంలో భక్తులకు అతను ఏం చేయబోతున్నాడో గ్రహించేలోగానే ఇది జరిగింది. దీంతో మొదట షాక్ అయిన భక్తులు అతనిని  పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

ఈ ఘటనతో కొద్దిసేపు ఆలయం వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బహుశః నిందితుడు మానసిక పరిస్థితి సరిగా ఉండకపోవచ్చని భక్తులు భావిస్తున్నారు. పోలీసులు ఆ కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు. 

Related Post