తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పధకం పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇప్పుడు తమిళనాడుకు కూడా వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. తాజాగా తమిళనాడు సిఎం విజయ్ నేతృత్వంలోని టీవికే ప్రభుత్వం కూడా ‘వెట్రి పయనం’ పేరుతో ఈ పధకాన్ని ప్రవేశపెట్టింది.
నేడు గాంధీ జయంతి సందర్భంగా సిఎం విజయ్ చెన్నైలోని కోయంబేడు బస్టాండులో లాంచనంగా ఈ పధకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా సిఎం విజయ్ స్వయంగా మహిళలకు ‘జీరో టికెట్స్’ అందజేశారు.
ఒక్క ఏసీ అంతరాష్ట్ర బస్సులు మినహా రాష్ట్రంలో తిరిగే అన్ని ప్రభుత్వ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా ఈ పధకాన్ని వర్తింపజేసినందున వారు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు.