ఇరుముడి సినిమాతో మళ్ళీ గాడిన పడ్డ మాస్ మహారాజా రవితేజ, తన తదుపరి సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒకవేళ సినిమా పేరు తులాభారమే అయినప్పటికీ ఇది పౌరాణిక సినిమా మాత్రం కాదు. ఇదొక హారర్ కామెడీ చిత్రమని సమాచారం. ఇరుముడి విజయం తర్వాత రవితేజ తొలిసారిగా వివేక్ ఆత్రేయ కలిసి పనిచేయబోతున్నందున ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరానాడు పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ సినిమా టైటిల్‌తో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.