అక్టోబర్ 6న ఆదర్శ కుటుంబం ట్రైలర్‌

October 01, 2026


img

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా చేస్తున్న ‘ఆదర్శకుటుంబం’ అక్టోబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. కనుక ఈ నెల 6న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసి మర్నాటి నుంచి బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు.  

ఇటీవల నారాయణమ్మ స్పెషల్ సాంగ్‌ విడుదల చేశారు. దానిలో వెంకటేష్‌, నివేథా పేతురాజ్, డింపుల్ హయతీ, శ్రీనిధి కలిసి చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది.    

ఈ సినిమాలో నారా రోహిత్, నివేథా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రైవల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేశారు. 

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన ఈ క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష