కామ్రేడ్ కళ్యాణ్... ఎత్తర ఎత్తు లిరికల్

September 29, 2026


img

జానకీ రామ్‌ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా అక్టోబర్‌ 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఎత్తర ఎత్తు ఎర్రజెండా అంటూ ఉద్రేకంగా సాగే విప్లవ గీతం (లిరికల్ వీడియో సాంగ్‌) విడుదల చేశారు.

శ్రీవిష్ణు ఇలాంటి ఆవేశపూరితమైన పాత్ర చేయడం. అదీ.. కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులను ఏరిపారేసిన తర్వాత శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఎర్రజెండా అంటూ ఆవేశంగా దూసుకు వస్తుండటం విశేషం.

ఈ సినిమాలో మోస్ట్ వాంటడ్‌ మావోయిస్టుగా శ్రీవిష్ణు నటించారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్‌, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అయితే అయితే ఇది 90లలో జరిగిన కథ కనుక తాజా పరిణామాలతో సంబంధం లేదు.   

 ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్‌ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.            

స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష