బాలయ్య దాదా ట్రైలర్‌ వచ్చేసింది... చూశారా?

September 27, 2026


img

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న ‘దాదా’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ట్రైలర్‌ కూడా అలాగే ఉంది. కనుక సినిమాలో బాలయ్య మార్క్ పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉంటాయని వేరే చెప్పక్కరలేదు.     

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్‌ నటిస్తున్నారు. మంచు మనోజ్, సముద్రఖని, ఆర్‌.శరత్ కుమార్‌, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నర్గీస్ ఫఖిరీ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతున్నారు.  

ఈ సినిమాకు మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, వి.వెంకట్, రవివర్మ, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే ఫర్‌ చేస్తున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ బాలయ్య మార్క్ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 24న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష