మన దేశంలో మనుషులకు, జంతువులకు ముఖ్యంగా ఆవులు, కుక్కలు, కోతులు వంటి జంతువులతో విడదీయరాని అనుబంధం ఉంది. కనుక అవి కూడా జనంతో కలిసే జీవిస్తుంటాయి. సాధారణంగా గుళ్ళు, పర్యాటక స్థలాల వద్ద కనిపించే కోతులు పర్యాటకులు ఇచ్చే అరటిపళ్ళు, చిప్స్ వంటివి చాలా ఇష్టంగా తింటాయి. అవి కూడా కూల్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తుంటాయి. అయితే మద్యం కూడా ఇష్టపడతాయనే విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది.
జార్ఖండ్‌లోని రాంచీలోని ఓ కోతి అకస్మాత్తుగా ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న ఓ మద్యం సీసా తీసుకుని, దానిలో మద్యం తాగేసింది. అది క్వార్టర్ బాటిల్ మద్యం గటగటా తాగేయడం చూసి వైన్ షాప్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. తర్వాత కాసేపటికే అది ఆ మద్యం మత్తులో అక్కడే హాయిగా పడుకొంది. సిబ్బంది మాటలు వినపడినప్పుడు కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తోంది.
దాని పరిస్థితి చూసి సిబ్బందితో సహా మద్యం కొనుగోలుకు వచ్చిన వారందరూ నవ్వుకున్నారు. వారిలో కొందరు తమ మొబైల్ ఫోన్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఆ ఆడ కోతి కడుపుతో ఉంది. ఆ పరిస్థితిలో కూడా అది మద్యం తాగి కోతి చేష్టలు చేస్తుండటం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. మీరూ చూసి ఆనందించండి...