హుస్నాబాద్‌ ఆర్టీసీలో తండ్రి డ్రైవింగ్.. కొడుకు కండక్టర్

September 26, 2026
img

కొన్నిసార్లు తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటే.. కుమార్తె లేదా కుమారుడు అదే శాఖలో ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు భావోద్వేగానికి లోనవుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ప్రయాణికులుగా విమానం ఎక్కితే.. అదే విమానాన్ని తమ కొడుకు లేదా కూతురు నడుపుతున్నప్పుడు వారు మరిచిపోలేని అనుభూతిని పొందుతుంటారు. 

ఇప్పుడు ఇలాంటి అరుదైన ఘటన తెలంగాణలోని హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. ఎల్లయ్య గత 34 ఏళ్ళుగా టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు ప్రేమ్‌ వేరే ప్రాంతంలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను హుస్నాబాద్‌లో తండ్రి పనిచేసే డిపోకి బదిలీపై వచ్చారు. దీంతో తండ్రి నడుపుతున్న బస్సులోనే కొడుకు కండక్టర్‌గా ప్రయాణికులకు సేవలందించారు.

తాము ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ తండ్రీకొడుకులని తెలిసి ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరినీ అభినందించారు. 

సాధారణంగా ఉద్యోగ జీవితంలో తండ్రి తన బాధ్యతలు నిర్వర్తిస్తుంటే.. పిల్లలు తమ దారిలో వెళ్లిపోతారు. కానీ ఒకే వృత్తిలో ఉన్న తండ్రి, కొడుకు ఇలా ఒకే బస్సులో కలిసి పనిచేయడం మాత్రం ఎల్లయ్య కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

Related Post