గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్‌ సన్నాహాలు?

September 26, 2026


img

గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమైన బీఆర్ఎస్‌ పార్టీ, దాని వలన పార్టీకి కలిగిన రాజకీయ నష్టాన్ని గుర్తించి, ఇకపై జరిగే ప్రతీ ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టింది. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 

ముందుగా కొత్త ఓటర్లను గుర్తించడం, వారి పేర్లు నమోదు చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి, బలమైన అభ్యర్ధులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ వాణీదేవి మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆమె స్థానంలో స్పోర్ట్స్ అధారిటీ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశ్ పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ఆయనను ఢీ కొని ఓడించగల బలమైన అభ్యర్ధి కోసం బీఆర్ఎస్‌ పార్టీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. 

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఇది వరకు పోటీ చేసి ఓడిపోయినా ఏనుగుల రాకేశ్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   



Related Post