అవును! వాటి యుద్ధాలలో భగవంత్ కేసరి సీన్ కనిపించింది. అమెరికా- ఇరాన్ యుద్ధానికి నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకి సంబంధం ఏమిటని డౌటా? అయితే ఇది చదవాల్సిందే.
ఈ ఏడాది ఫిభ్రవరి నెలాఖరున మొదలైన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లే ముగిసి మళ్ళీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతీసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియాతో ఇరాన్ పని అయిపొయింది. ఇక యుద్ధం ముగిసినట్లే అని చెప్పుకోవడం, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ దాడులు చేయడం, అమెరికా ప్రతిదాడులు చేయడం తెలుగు టీవీ సీరియల్లా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమాలో ఓ వీడియో క్లిప్ పోస్ట్ చేయడం అందరూ నవ్వుకునేలా చేస్తుంది.
ఆ సన్నివేశంలో బాలకృష్ణపై విలన్ గ్యాంగ్ తుపాకులతో గుళ్ళ వర్షం కురిపిస్తుంటే, డ్రైనెజ్ హోల్ ప్లేట్ అడ్డం పట్టుకొని తర్వాత వారిపై భారీ మెషిన్ గన్‌తో కాల్పులు జరిపే సన్నివేశాన్ని జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దానికి ఆసక్తికర వ్యాఖ్యలు జోడించింది. ఇరాన్‌ని నిస్సహాయంగా చేస్తామని ట్రంప్ చెప్పుకుంటారు. కానీ ఇరాన్‌కు తనని తాను రక్షించుకోవడం ఎలాగో తెలుసు. ఇది గ్రహించినప్పటి నుంచి అమెరికా హాలీవుడ్ సినిమాలకు బదులు బాలీవుడ్ సినిమాలు చేస్తోందని పేర్కొంది. కనుక అమెరికా అధినేతకు అర్ధమయ్యే భాషలోనే సమాధానం చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేసినట్లు భావించవచ్చు.
కానీ ఈ సన్నివేశాన్ని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఇరాన్ అధికారులు కూడా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చూస్తున్నారనే కొత్త విషయం బయటపడింది. మన తెలుగు సినిమాలకు ఇంత ఫాలోయింగ్ ఉండటం సంతోషమే కదా?
Trump talks about annihilating Iran.
— Iran Embassy in Zimbabwe (@IRANinZIMBABWE) September 23, 2026
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood. pic.twitter.com/v6Le8zkH5X