ధనుష్ 56వ సినిమా షురూ!

September 25, 2026


img

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా మధురైలో పూజా కార్యక్రమాలతో లాంచనంగా మొదలైంది. తమిళరసన్ పచముత్తు దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో వడివేలు, ఎస్‌.జే. సూర్య, విజయ్ కుమార్ ముఖ్య పాత్రలు చేయబోతున్నారు. 

తమిళరసన్ పచముత్తు ‘లబ్బర్ పందు’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కనుక వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.  

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: తమిళరసన్ పచముత్తు, సంగీతం: సాయి అభ్యంకర్ చేస్తున్నారు. 

మన తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష