శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా చేస్తున్న’జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్ వచ్చేసింది. సినిమా పేరులోనే రెండు మతాలను సూచించారు కనుక ఫస్ట్ బూస్టర్‌లో కూడా అదే చూపారు.
శర్వాను ఓ చర్చిలో ఫాదర్‌గా, సన్యాసి వేషంలో ఉన్న బాబాగా చూపారు. బహుశః మతం పేరుతో ప్రజలను మోసగించే వ్యక్తి కధ అయ్యుండవచ్చు లేదా హీరోయిన్ ప్రేమ కోసం రెండు మతాల మద్య ఊగిసలాడుతూ హీరో చేసిన డాన్స్ సన్నివేశం కావచ్చు.
కానీ ‘జార్జ్ క్రిష్’గా శర్వానంద్ లుక్స్ బాగున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాశి నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: నందు సవిరిగన, సంగీతం: అనుప్ రూబెన్స్, కెమెరా: కేవీ గుహన్, ఆర్ట్: కొల్ల అవినాష్, ఎడిటింగ్: అమర్ రెడ్డి, :గోపీ మోహన్ చేస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, అజయ్ సుంకర, రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికపాటి కలిసి నిర్మిస్తున్న ‘జార్జ్ క్రిష్’ 2027, జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/xvF-7Q9wy9Q?si=TCjQLr5sas8A1uYL" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>