హైదరాబాద్‌లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ముత్తా చంద్రశేఖర్ (36) హైదరాబాద్‌లోని శాలివాహననగర్ డ్రీమ్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు.
మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అంబర్‌పేట హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
ఇటీవల మంచిర్యాలకు చెందిన సమీప బంధువైన ఓ యువతితో చంద్రశేఖర్‌కు వివాహం నిశ్చయమైంది. అయితే కొంతకాలం తర్వాత వారి మద్య విభేదాలు ఏర్పడటంతో తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తెలిపాడు. అప్పటి నుంచి వారి మద్య గొడవలు ఇంకా పెరిగాయి. దీంతో ఇరు కుటుంబాలు సమావేశమయ్యి మాట్లాడుకొని పెళ్ళి రద్దు చేసుకున్నారు.
కనుక పెళ్ళి విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ముత్తా చంద్రశేఖర్ ఆదివారం అర్ధరాత్రి ఆ యువతికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువతి వెంటనే మలక్‌పేట పోలీసులు ఫోన్ చేసి సమాచారం అందించింది.
వారు వెంటనే వెళ్ళి తలుపులు పగులగొట్టి అతనిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా, అతను అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.