తెలంగాణ బిజేపి ఇన్‌ఛార్జ్‌గా సునీల్ భన్సాల్

September 23, 2026


img

వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి రావడమే తమ పార్టీ లక్ష్యమని ప్రధాని మోడీ ఇది వరకే చెప్పి వెళ్ళారు. కనుక మరికొన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ బిజేపి ఇన్‌ఛార్జ్‌గా సునీల్ భన్సాల్‌ని నియమించింది. ఆయనతో పాటు అభయ్ పాటిల్, రేఖా శర్మలను సహా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. ఏపీ బిజేపి ఇన్‌ఛార్జ్‌గా అరవింద్ భాదౌరియాని, సహ ఇన్‌ఛార్జ్‌ గా వనతి శ్రీనివాసన్ని నియమించింది. దగ్గుబాటి పురందేశ్వరిని ఓడిశా బిజేపి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.  

తమిళనాడు బిజేపి ఇన్‌ఛార్జ్‌గా రాంమాధవ్, ఆయనకు సహా ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణ బిజేపి సీనియర్ లీడర్ డీకే అరుణను నియమించింది. 

కర్ణాటక, బిహార్‌ బిజేపి ఇన్‌ఛార్జ్‌గా హరీష్ దివ్వేదిని నియమించింది. కర్ణాటక సహా ఇన్‌ఛార్జ్‌గా వెంకటేశ్వర్లునినియమించింది. ఇంకా యూపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు  బిజేపి ఇన్‌ఛార్జ్‌లను నియమించింది.


Related Post