సినిమా చూస్తా అనుమతివ్వండి: నాని

September 23, 2026


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కాయదు లోహర్ జంటగా నటించిన ‘ది ప్యారడైజ్’ రేపు అంటే సెప్టెంబర్‌లో 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా హీరో నాని, తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సోషల్ మీడియా ద్వారా ఓ విజ్ఞప్తి చేశారు.

తాను చిన్నప్పటి నుంచి సినిమా అభిమానినని, కనుక తాను నటించిన ఈ సినిమాను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో థియేటర్లో  ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తాను అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన ప్రోటోకాల్స్‌ను పాటిస్తామని నాని హామీ ఇచ్చారు. 

నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానికి  అభినందనలు తెలిపి, ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకొని వారి అనుమతి పొందాలని సూచించారు. మీ దరఖాస్తును సంబంధిత పోలీసు బృందం పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందని సిఎం రేవంత్‌ రెడ్డి బదులిచ్చారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ని ట్యాగ్ చేస్తూ రీట్వీట్‌ చేశారు. కనుక నాని థియేటర్లో సినిమా చూసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయమని సూచించినట్లే భావించవచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష