మహావీర్ కర్ణ… రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్..

September 22, 2026


img

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్‌ నటుడు రాఘవ లారెన్స్ తొలిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. ‘మహావీర్ కర్ణ’ సినిమాలో ఆయన కర్ణుడుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్‌  ఫస్ట్ లుక్‌ చిత్ర బృందం విడుదల చేశారు. 

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఈ సినిమా చేస్తుండటం మరో విశేషం.

ఈ సినిమాకు  సంగీతం: జ్ఞాని, సినిమాటోగ్రఫీ: రామ్‌జీ దత్, డైలాగ్స్: శ్రీమణి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు. 

జయంతీలాల్ గడా సమర్పణలో పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్‌వీ ఫిల్మ్ హౌస్ బ్యానర్లపై రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా నిర్మిస్తున్న ‘మహావీర్ కర్ణ’ 2027లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.


Related Post

సినిమా స‌మీక్ష