ఓటీటీలోకి ‘పూజా మేరీ జాన్‌’.. ఎప్పటి నుంచి అంటే?

September 20, 2026


img

మృణాల్‌ ఠాకూర్‌, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పూజా మేరీ జాన్‌’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా షూటింగ్‌ పూర్తయి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా ఇంతవరకు థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడీ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్‌ 2న జీ5 ఓటీటీలో ‘పూజా మేరీ జాన్‌’ ప్రసారం కాబోతోంది. 

నవ్‌జోత్‌ గులాటి దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌లో మృణాల్‌ ఠాకూర్‌, ప్రియుడి మరణం తర్వాత చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే మహిళ పూజగా నటించారు. 

పూజాకు అండగా నిలిచే సనా అనే లాయర్‌ పాత్రలో హుమా ఖురేషి నటించారు. ఆమె కూడా ఒకవైపు స్నేహితుడి మరణంతో బాధపడుతూనే మరోవైపు పూజా కేసును స్వీకరించి న్యాయపోరాటం చేయాల్సి వస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష