నిఖిల్ విజయేంద్ర సింహ, తేజు అశ్విని జంటగా నటిస్తున్న‘సంగీత్’ సినిమా నుంచి ‘నీ వల్లే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదల చేశారు.
విక్రమ్ శివ వ్రాసిన ఈ పాటని అచ్చు రాజామణి స్వరపరిచి సంగీతం అందించగా సిద్ శ్రీరామ్ ఈ రొమాంటిక్ సాంగ్‌కు ప్రాణం పోసినట్లు అద్భుతంగా ఆలపించారు.
సాద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ శివ, సూర్య గణపతి, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘సంగీత్’కు కథ, దర్శకత్వం: సాద్ ఖాన్, సంగీతం: కళ్యాన్ నాయక, సిద్ధాంత్ సుందర్, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటింగ్: విజయేత్ చంద్ర చేస్తున్నారు.
లహరి ఫిల్మ్స్, ఆర్‌బీ స్టూడియోస్ బ్యానర్లపై నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రావంతి నవీన్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.