మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వయంగా వ్రాసుకున్న కధతో స్వీయ దర్శకత్వంలో చేస్తున్న సినిమా #కల్ట్. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా రేపు రిలీజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో వేసిన పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటించడం లేదు. కొంతమంది నూతన నటీనటులను పరిచయం చేస్తానని ముందే చెప్పారు. వియత్నాంలో జరిగిన ఓ యదార్ధ ఘటన ఆధారంగా తాను ఈ కధ వ్రాసుకున్నానని విశ్వక్ సేన్ చెప్పారు. నేడు #కల్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అంటూ వేసిన పోస్టర్‌లో హర్రర్ చూశారు.. థ్రిల్లర్స్ చూశారు. కానీ ఇక రాబోయేది ఎన్నడూ చూసి ఉండరు... అంటూ రెండు కొమ్ములు కలిగిన పిల్ల రాక్షసుడి బొమ్మ వేశారు. మళ్ళీ ఆ పిల్ల రాక్షసుడు బఫూన్ అన్నట్లు పోస్టర్‌లో చూపడం నిజంగానే ఈ సినిమా దేని గురించి అనే ఆసక్తి కలిగిస్తుంది.
ఈ సినిమాకు కధ విశ్వక్ సేన్, డైలాగ్స్: తరుణ్ భాస్కర్, సంగీతం: రవి బస్రూర్, ఆర్ట్: అరవింద్ మూలే చేస్తున్నారు.
తారక్ సినిమాస్, వాన్మయి క్రియేషన్స్ బ్యానర్లపై #కల్ట్ సినిమాను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో రూపొందిస్తున్నారు.