సిఎం రేవంత్ రెడ్డి నిన్న శాసనసభలో కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నేతలపై చేసిన భూఆరోపణలలో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు కూడా ప్రస్తావించారు. దానిపై నవీన్ రావు సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు. దానిలో నా పేరుతో ఉన్న మెజారిటీ భూములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే, 2014కు పూర్వం కొనుగోలు చేసినవే.
వాటిని అప్పట్లో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారమే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అదేవిధంగా, మా కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న భూములు కూడా చట్టబద్ధంగా కొనుగోలు చేసి కలిగి ఉన్న భూములే.
ముఖ్యంగా, మా కుటుంబానికి చెందిన భూములకు ధరణి ఎంట్రీలు లేదా 22-A నిషేధిత భూముల జాబితాతో ఎటువంటి సంబంధం లేదు,” అంటూ పెద్ద లేఖ పోస్ట్ చేసి, తాను అక్రమంగా భూములు పోగేసుకున్నానని భావిస్తే ఆధారాలతో సహా నిరూపించాలని సవాలు విసిరారు.
నవీన్ రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా గురించి, నా తండ్రి కే. కొండల్ రావు గారి గురించి, మా కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో చేసిన వ్యాఖ్యలపై కొన్ని విషయాలను స్పష్టం చేయదలిచాను.
— BRS News (@BRSParty_News) September 17, 2026
నేను 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. 2023లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. ఎన్నికల సమయంలో చట్టప్రకారం నా… pic.twitter.com/NBiZ7rfCoa