కేసీఆర్‌ పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు: కేటీఆర్‌

September 17, 2026


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న శాసనసభలో కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రంలో లక్ష కోట్లు విలువైన భూపిడికీ పాల్పడిందంటూ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. 

నేడు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ గారు పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఆయన తండ్రికి అంటే మా తాతగారికి ఆ రోజుల్లోనే వందల ఎకరాలు ఉన్నాయి.

నాడు అప్పర్ మానేరు ప్రాజెక్టులో మా నాయన్తానమ్తమ భూములు ముంపుకు గురయినప్పుడు, నష్టపరిహారంగా లక్షల రూపాయలు ముట్టాయి. వాటితోనే వారు చింతమడకలో వందల ఎకరాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేసేవారు.

ఆ తర్వాత చింతమడకలో ఆ రెండెకరాల ఇంటిని ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారు. కేసీఆర్‌ గారు రైతు కుటుంబానికి చెందినవారు కనుక వ్యవసాయం మీద మక్కువతో ఈనాటికీ వ్యవసాయం చేస్తూన్నారు. 

మొదటినుండే వందల ఎకరాలు ఉన్నాయి కనుకనే కేసీఆర్‌ని సిఎం రేవంత్‌ రెడ్డి ‘దొర’ అని వ్యంగ్యంగా విమర్శిస్తుంటారు. మళ్ళీ అదే నోటితో కేసీఆర్‌ భూములు దోచుకొని బాగా సంపాదించుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుంటాడు.

కనుక కేసీఆర్‌ విషయంలో ముందు రేవంత్ రెడ్డికే క్లారిటీ లేదు. కనుక ముందు ఈ స్పష్టత తెచ్చుకున్న తర్వాత కేసీఆర్‌ గారి గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి,” అని కేటీఆర్ అన్నారు. 


Related Post