ఈ పాట కోరినవారు ట్రైలర్‌.. ఇలా ఉందేమిటి?

September 15, 2026


img

తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద పేరుతో వస్తోంది..  “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” అనే సినిమా. 

అతిపెద్ద టైటిల్‌ కలిగిన ఈ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. అది చూస్తే అయితే సినిమా టైటిల్‌కి, కథకి సంబంధం ఉందా లేదా? అనే సందేహం కలుగుతుంది.    

 ‘ఆ నలుగురు’ వంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో హర్ష హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవి వర్మ, అశోక్ వర్ధన్, రేఖానిరోషా తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 

“ఎ ఫర్ బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్ బిడెన్ సాగా” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రెయిన్ మ్యాపింగ్, సౌండ్ థెరపీ,మెమొరీస్ వంటి భావోద్వేగాలతో సంగీత ప్రాధాన్యంగా ఉంటుందని  తెలుస్తోంది. ఈ సినిమాకు సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష