ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ మొదటి భాగం నుంచి ‘జై జై రామ్..’ అంటూ సాగే పాట వినాయక చవితి సందర్భంగా విడుదలైంది. ఏఆర్ రహమాన్ సంగీతం సమకూర్చిన ఈ పాటని శ్రేయ గోషల్, అర్జిత్ సింగ్, కుమార్ విశ్వాస్ కలిసి పాడారు.
రామాయణలో హనుమంతుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, లక్ష్మణుడుగా రవీ దుబే, అరుణ్ గోవిల్ దశరథుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రావణుడుగా కన్నడ నటుడు యష్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అలాగే 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌జీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పనిచేస్తోంది. ఈ ఏడాది దీపావళి (నవంబర్ 8)న రామాయణ మొదటి భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కాబోతోంది.