రిపబ్లికన్లు గెలిస్తే.. ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు!

September 10, 2026


img

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన హామీ ఇచ్చారు. నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిలోనూ మెజారిటీ సాధిస్తే.. ప్రతి వయోజన అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్లు చెల్లిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. దీనికి ‘ట్రంప్ డివిడెండ్’ అని ఆయన పేరు పెట్టారు.

డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సదస్సులో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ప్రతి వయోజన అమెరికన్‌కు 5 వేల డాలర్లు చొప్పున చెల్లించాలంటే కనీసం 1 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండొవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే అమెరికా భారీగా బడ్జెట్ లోటులో ఉంది. మరో 40 ట్రిలియన్ డాలర్లకు పైగా జాతీయ రుణం కూడా ఉంది. ఇదిగాక ఇరాన్‌ మొదలుపెట్టిన యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. దానికీ లక్షల డాలర్లు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ఇంత డబ్బు ఏవిధంగా సమకూరుస్తారు? ఈ పథకానని ఎలా అమలు చేస్తారనే విషయాలపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు.


Related Post