బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. వారిరువురూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా ఈ కేసులో ప్రజా ప్రతినిధులైన వారికి రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని చెప్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది.
ఆ రోజున వారిరువురూ స్వయంగా కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు షరతులన్నిటికీ వారు అంగీకరించడంతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశం మేరకు ఇద్దరూ చెరో రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పింఛి బయటపడ్డారు.
వారిద్దరికీ ఈ కేసులో ఉపశమనం లభించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై అనర్హత వేటు వేసే ఆలోచనలో ఉంది. అదే జరిగితే వారిరువురూ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.