ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ రాజు మృతి చెందారు. ఈరోజు ఉదయం శాసనసభ ఆవరణలో ఆయన హటాత్తుగా కుప్ప కూలిపోయారు. అక్కడే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి ప్రాణం కాపాడే ప్రయత్నం చేశారు. ఆయనను వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అంతవరకు తమతో మాట్లాడిన రాజు గుండెపోటుతో చనిపోయారని తెలిసి అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు షాక్ అయ్యారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు.
మనిషికి చావు ఎప్పుడొస్తుందో తెలీదు. కానీ బతికి ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటూ, ద్వేషించుకుంటూ శత్రువులను సృష్టించుకుంటూనే ఉంటారు. నిన్న శాసనసభ ఆవరణలో జరిగిన ఘటనలు ఇందుకు ఒక ఉదాహరణ కాగా, ‘నేను చచ్చిపోవాలని కోరుకునేవారితో చర్చలు ఏమిటి?’ అనే కేసీఆర్ ప్రశ్న మరో ఉదాహరణగా భావించవచ్చు.