సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘అంతా రాములే చూసుకుంటారు’ అనే పేరు ఖరారు చేశారు. టైటిల్ గ్లిమ్స్‌లో హీరో హీరోయిన్ల ప్రేమ, భావోద్వేగాలు చాలా చక్కగా చూపారు.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, రఘుబాబు, అలీ, ఝాన్సీ, వినోద్ కుమార్, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: లక్ష్మీ భూపాల్, స్క్రీన్‌ప్లే: పల్నాటి సూర్య ప్రతాప్, సంగీతం: మిక్కీ జె. మేయర్, సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. .
ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, వీజీబీ ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.